Breaking News

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి

Published on Sun, 08/25/2024 - 08:30

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్‌ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్‌ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్‌ సైనికులను క్రెమ్లిన్‌  నిర్బంధించిందని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. 

వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్‌ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్‌ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్‌లో ఉ‍న్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 

22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)