Breaking News

మాస్కో మారణకాండలో 115 చేరిన మృతుల సంఖ్య, 11 మంది అరెస్ట్‌

Published on Sat, 03/23/2024 - 15:37

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రాకస్‌ సిటీ కన్టర్ట్‌ హాల్‌లో శుక్రవారం ఐసిస్‌ తీవ్రవాదులు ఒడిగట్టిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 115 చేరింది. 145 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 11 మందిని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

రషన్స్‌ శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో కారును వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల కారులో పిస్టల్, అసాల్ట్ రైఫిల్‌కు సంబంధించిన మ్యాగజైన్, తజకిస్థాన్‌కు చెందిన పాస్‌పోర్ట్‌లు లభించాయని తెలిపారు.

మరో ఇద్దరు నిందితులు కాలినడకన సమీపంలోని అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా పశ్చిమ మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లోకి దుండగులు విరుచుకుపడి కాల్పులు జరిపిన జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పటికే ప్రకటించింది.
చదవండి: మాట మార్చిన మాల్దీవులు.. భారత్‌ ఎప్పుడూ మిత్రుడే అంటూ..

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)