Breaking News

జీ7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్‌.. ఏంటంటే?

Published on Fri, 06/14/2024 - 19:19

రోమ్‌ : ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుంది. ఈ కీలక సమావేశం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై జరుగుతోంది. అదే సమయంలో గత రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై జరుపుతున్న కాల్పుల్ని విరమిస్తామని తెలుపుతూనే షరతులు విధించారు.  

జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయా ప్రపంచ దేశాది నేతలతో కీలక ద్వైపాక్షిక సమావేశాలను కొనసాగిస్తున్నారు. సమావేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, మోదీల మధ్య భేటీ జరిగింది. జెలెన్‌స్కీ తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌,యూకే ప్రధాని రిషి సునక్‌లతో మోదీ భేటీ నిర్వహించారు.  

ఇక, జెలెన్‌స్కీతో భేటీ అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ భేటీ ప్రొడక్టీవ్‌తో కూడుకున్నదని, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడమే శాంతికి మార్గం అని ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధంపై భారత్‌ వైఖరేంటో చెప్పకనే చెప్పారు మోదీ.

ఇక ఈ జీ7 సదస్సులో ఫ్రీజ్‌ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపగా.. జీ7 సదస్సు కొనసాగుతున్న తరుణంలో కాల్పుల విరమణకు ఆదేశిస్తామంటూ పుతిన్‌.. ఉక్రెయిన్‌కు ఆఫర్‌ ఇచ్చారు. 

అందుకు రెండు షరతులు విధించారు. యుద్ధ సమయంలో రష్యా నాలుగు ఉక్రెయిన్‌ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉక్రెయిన్‌ బలగాలు వెనక్కి వెళ్లిపోవడం, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. తుది పరిష్కారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ ప్రకటన చేయడం గమనార్హం.

మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌, మోదీల భేటీపై ఫ్రాన్స్‌లోని భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, వాతావరణ చర్య, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ టెక్నాలజీలు, కనెక్టివిటీ, సంస్కృతి వంటి అంశాలతో సహా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. కీలకమైన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారని అన్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)