Breaking News

మిస్‌వరల్డ్ 2025గా థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత

Published on Sat, 05/31/2025 - 16:32

Miss World 2025 Grand Finale Updates:

👉మిస్‌వరల్డ్ 2025గా థాయ్‌లాండ్‌ సుందరి

  • మిస్‌ వరల్డ్ 2025గా థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత
  • విజేత ఓపల్‌ సుచాతకు బ్లూక్రౌన్‌ అలంకరించిన క్రిస్టినా
  • మిస్‌ వరల్డ్‌ 1వ రన్నరప్‌గా ఇథియోపియా సుందరి అడ్మాస్సు
  • మిస్‌ వరల్డ్‌ 2వ రన్నరప్‌గా  పోలాండ్‌ సుందరి మాజా క్లాజ్డ్‌
  • మిస్‌ వరల్డ్‌ 3వ రన్నరప్‌గా  మార్టినిక్‌ భామ అరోలి జోచిమ్‌

👉మిస్ వరల్డ్ లో ఫైనల్ రౌండ్ ప్రారంభం

  • జడ్జీలు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్‌ల సమాధానాలు
  • వాటికి మార్కుల ఆధారంగా విజేత

👉మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డు అందుకున్న సోనూ సూద్

  • కోవిడ్‌ సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించిన మిస్ వరల్డ్ నిర్వాహకులు
  • రానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేత
  • స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహ పరిచిన సోనూ సూద్
  • తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పిన సోనూసూద్

👉టాప్-8 లో చోటు దక్కించుకోలేకపోయిన ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా
     ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేసిన నిర్వాహకులు

👉మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..

  • అమెరికా ఖండం నుంచి మార్టినిక్
    ఆఫ్రికా నుంచి ఇథియోపియా
    యూరోప్ నుంచి పోలెండ్
    ఆసియా నుంచి థాయిలాండ్

👉మిస్‌ వరల్డ్‌ పోటీల నుంచి నిష్క్రమించిన మిస్‌ ఇండియా నందిని గుప్తా

  • ఆసియా నుంచి టాప్‌-2లో చేరిన థాయ్‌లాండ్‌
  • నువ్వు మిస్‌ వరల్డ్‌ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నతో 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం
  • అభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు
     

👉మిస్‌ వరల్డ్‌ ఫినాలే నుంచి మిస్‌ ఇండియా ఎలిమినేట్‌

  • ఎలిమినేటైన మిస్‌ ఇండియా నందిని గుప్తా
  • టాప్‌-8లో మార్టినిక్‌, బ్రెజిల్‌, ఇథియోఫియా, నమీబియా, పోలెండ్‌,  ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్‌, థాయ్‌లాండ్‌లు

 

👉ఆసియా నుంచి టాప్ 5లో మిస్ ఇండియా నందిని గుప్తా
     టాప్ 20 లో ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తాకు చోటు

👉మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా సుధా రెడ్డి నియామకం

  • జ్ఞాపికను అందించిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ
  • చాలా ఆనందంగా ఉందన్న సుధా రెడ్డి
  • అద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపిన సుధా రెడ్డి

👉జడ్జిలుగా..

  • జూలియా మోర్లీ 
  • నటుడు సోనూ సూద్
  • సుధా రెడ్డి 
  • రానా దగ్గుబాటి
  • జయేష్ రంజన్ 
  • మనూషి చిల్లర్ 
  • నమ్రత శిరోద్కర్ 
  • డోనా వాళ్ష్
  • కరినా టర్రెల్

👉అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్

  • కుటుంబ సమేతంగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్
  • హాజరైన సీఎం రేవంత్‌ కుటుంబ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఫినాలేకు  రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్‌లుగా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు.

2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్‌.. ఫినాలే ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్‌ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్‌ను ప్రకటించనున్నారు.  2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు  ఫినాలేలో పోటీపడుతున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్‌లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్‌లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.

బ్యూటీ విత్ ఎ పర్సస్‌లో  మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజేతలుగా నిలిచారు. బ్యూటీ విత్ ఎ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోను మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్ లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్‌లో మిస్ టర్కీ విన్ అయ్యారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో  మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్ మోడల్‌గా నిలిచారు.

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)