Breaking News

ట్రంప్‌ బెదిరిస్తే భయపడలా?: మెక్సికో అధ్యక్షురాలు

Published on Thu, 02/20/2025 - 11:11

పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారామె. 

‘‘ట్రంప్‌ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్‌ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారామె. 

వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్‌ డ్రగ్‌ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే.. 

మెక్సికోపై ట్రంప్‌ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్‌లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)