Breaking News

రష్యాలో హైడ్రామా మధ్య ముగిసిన తిరుగుబాటు సంక్షోభం

Published on Sun, 06/25/2023 - 10:22

మాస్కో: తిరుగుబాటు నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకునే విధంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించింది. దీంతో మాస్కో వైపుగా కదులుతామని హెచ్చరించిన వాగ్నర్ తిరుగుబాటు సైన్యం శాంతించి తిరుగుముఖం పట్టింది. 

క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ మాట్లాడుతూ రక్తపాతాన్ని నిరోధించి, అంతర్గత ఘర్షణలను తగ్గుముఖం పట్టించి, పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీయకుండా చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్బంగా దేశం కోసం వారు చేసిన వీరోచిత పోరాటాలను మేమెప్పుడూ గౌరవిస్తామని అన్నారు.

బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో జరిపిన ఈ మధ్యవర్తిత్వం ప్రకారం వాగ్నర్ సైన్యం నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లుగానూ, అలాగే వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ కూడా ఉండదని పెస్కోవ్ అన్నారు. ఇక ఈ తిరుగుబాటులో పాల్గొనని సైనికులు యధాతధంగా తమ విధులకు హాజరవ్వొచ్చని తెలిపారు. 

యెవ్జెనీ ప్రిగోజిన్ పై తీవ్రవాద నేరం మోపబడ్డ గంటల వ్యవధిలోనే అతని తిరుగుబాటు సైన్యం రష్యాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. శనివారం రష్యా సైన్యంపై చేసిన తిరుగుబాటుకి దక్షిణ రష్యా అట్టుడికిపోయింది.

అప్పటికే ఆర్మీ  ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపుగా వస్తున్నామని ప్రిగోజిన్ ప్రకటించారు. దీంతో మరింత విధ్వంసం తప్పదని భావించిన తరుణంలో రష్యా మిత్రపక్షమైన బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో చొరవ తీసుకుని జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో ఊపిరి తీసుకున్నాయి రష్యా శ్రేణులు.

ఇది కూడా చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

     

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)