Breaking News

పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

Published on Thu, 02/19/2026 - 15:44

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల Y క్రోమోజోమ్‌ (Y-chromosome)ను ఎక్కువగా నష్ట పోతున్నారట.  వృద్ధ పురుషుల్లో Y క్రోమోజోమ్ క్షీణించడం సాధారణమే అయినప్పటికీ కానీ తాజాగా ఈ ధోరణి బాగా పెరుగుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతోపాటు,  తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉంది అంటున్నారు పరిశోధకులు 

వయస్సు పెరిగే కొద్దీ పురుషులలో 'Y' క్రోమోజోమ్ కోల్పోవడం (LOY) వల్ల అనేక  ఆరోగ్య సమస్యలతో ముడిపడి  ఉందంటున్నారు. ఈ మార్పు గుండె జబ్బులు, క్యాన్సర్ , తక్కువ ఆయుష్షుకు ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. గతంలో, Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల పెద్దగా నష్టం లేదని పరిశోధకులు భావించేవారు. ఎందుకంటే ఇందులో ఇతర క్రోమోజోమ్‌ల కంటే తక్కువ జన్యువులు ఉంటాయి. దీని ప్రధాన పని పురుష లక్షణాలను నిర్ణయించడం మరియు వీర్యకణాల అభివృద్ధికి తోడ్పడటం మాత్రమే అని అనుకునేవారు. కానీ కొత్త పరిశోధనలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి.

60 ఏళ్ల పురుషులలో సుమారు 40శాతం మందిలో, 90 ఏళ్ల వారిలో 57శాతం మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ధూమపానం, రసాయనాల ప్రభావం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. Y క్రోమోజోమ్ లేని కణాలు వేగంగా పెరుగుతాయి. ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల శరీరంలో ట్యూమర్లు (గడ్డలు) వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!

ఆరోగ్య సమస్యలు 
Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఆధారాలు లభించాయిప్రధానంగా గుండె జబ్బులు, అల్జీమర్స్ క్యాన్సర్:లాంటివి. జర్మనీలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం ప్రకారం, 60 ఏళ్లు పైబడిన పురుషులలో Y క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రక్త కణాలలో 'Y' లేకపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అల్జీమర్స్ రోగులలో ఈ లోపం పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ కణాలలో Y క్రోమోజోమ్ పూర్తిగా ఉండదు.

ఇతర వ్యాధులు: కిడ్నీ వ్యాధులు, కరోనా (COVID-19) మరణాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని కూడా అంచనా వేశారు.ఎలుకల మీద చేసిన ప్రయోగాలలో, Y క్రోమోజోమ్ లేని రక్తకణాలను ఎక్కించినప్పుడు వాటిలో గుండె వైఫల్యం ,గుండె బలహీనపడటం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.

ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!


'Y' క్రోమోజోమ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
మానవ కణాలలో సాధారణంగా 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అందులో ఒక జత 'లైంగిక క్రోమోజోములు'. స్త్రీలలో రెండు 'X' క్రోమోజోములు ఉంటే, పురుషులలో ఒక 'X' , ఒక 'Y' క్రోమోజోమ్ ఉంటాయి.Y  క్రోమోజోమ్ సాపేక్షంగా తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. దీని ప్రధాన పాత్ర పురుష లింగ నిర్ధారణ.ఇది సాధారణ స్పెర్మ్ అభివృద్ధికి కూడా  తోడ్పడుతుంది. దీనిలో సుమారు 51 ప్రోటీన్-కోడింగ్ జన్యువులు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.కొన్ని 'Y' జన్యువులు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే (Cancer suppressors) గుణాన్ని కలిగి ఉంటాయి.

Y క్రోమోజోమ్ ఎందుకు పోతుంది అంటే కణాలు విభజన చెందే సమయంలో జరిగే పొరపాట్ల వల్ల 'Y' క్రోమోజోమ్ కణాల నుండి తొలగిపోతుంది. Y' క్రోమోజోమ్ కేవలం పురుషత్వాన్ని నిర్ణయించేది మాత్రమే కాదు, అది మొత్తం శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. భవిష్యత్తులో ఈ క్రోమోజోమ్ లోపాన్ని ముందే గుర్తించడం ద్వారా పురుషులలో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి: పక్షవాతంతో భర్త.. 70 ఏళ్ల మహిళ హత్య : రూ. 65 లక్షల గోల్డ్‌ చోరీ

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)