Breaking News

వివాదంలో బ్రిటన్‌ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?

Published on Sun, 11/10/2024 - 14:13

లండన్‌ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు.  ఇటీవల ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తన నివాసం 10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది.  

యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్‌ స్టార్మర్‌ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.

అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తమకు నాన్‌వెజ్‌, లిక్కర్‌లను అందించారని బ్రిటన్‌  హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని  కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌, వైన్స్‌, బీర్‌ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్‌,బీర్‌లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్‌ స్టార్మర్‌ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్‌,భారత్‌లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్మారర్‌ స్పందించాల్సి ఉంది.

కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్  స్టార్మర్  నేతృత్వంలోని లేబర్  పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)