Breaking News

నాటో చీఫ్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

Published on Fri, 09/26/2025 - 19:29

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధినేత పుతిన్‌కు ఫోన్‌చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రెటరీ జనరల్‌ మార్క్‌ రుటే చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్‌ జైస్వాల్‌ శుక్రవారం ఖండించారు. రుటే వ్యాఖ్యలు ఆధారరహితం అని తేల్చిచెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోదీ ఆసక్తి కనబర్చారని, ఇటీవల పుతిన్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారని మార్క్‌ రుటే చెప్పడం సంచలనం సృష్టించింది. జరగని సంభాషణ జరిగినట్లు మార్క్‌ రుటే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ«దీర్‌ జైస్వాల్‌ అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని రుటేకు హితవు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా వ్యూహం గురించి మోదీ తెలుసుకోలేదని స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంటామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. రష్యా నుంచి పశ్చిమ దేశాలు కూడా ముడి చమురు కొంటున్నాయని రణ«దీర్‌ జైస్వాల్‌ పరోక్షంగా గుర్తుచేశారు.   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)