రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Published on Fri, 09/19/2025 - 06:54

రష్యాలో భారీ భూకంపం సంభవించింది.  భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.8గా నమోదు అయింది. దీంతో  యూఎస్‌ జాతీయ ఆరోగ్య సర్వీస్‌ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. 

పెట్రోపావ్లోవ్స్‌-కామ్చాట్‌స్కీ రీజియన్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో ఐదుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

రష్యాలో తరచూ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం—అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) లో భాగంగా ఉండటం. ఇది భూమి మీద అత్యంత చురుకైన భూకంప, అగ్నిపర్వత ప్రాంతం. ప్రధానంగా కమ్చట్కా ద్వీపకల్పం ప్రాంతం పసిఫిక్ ప్లేట్-యూరేషియన్ ప్లేట్ మధ్య ఉంది. ఇవి ఒకదానిని మరొకటి గుద్దుతూ కదలడం వల్ల భూకంపాలు ఏర్పడతాయి. 

ఇదిలా ఉంటే.. ఇటు ఇండోనేషియాలోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్‌ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం వేకువ జాము సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 28 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)