Breaking News

కువైట్ తీరంలో పేలిన ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్.. అమెరికా పనేనా

Published on Thu, 03/05/2026 - 08:40

కువైట్‌ సిటీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధంలో తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. కువైట్ తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఓ పెద్ద ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో సముద్రంలో భారీగా చమురు లీక్ అవుతూ, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడిందని యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) ఈ సంఘటనను ధృవీకరించింది. ఆ ట్యాంకర్‌ను పేల్చింది అమెరికానేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ​

కువైట్‌ సముద్ర తీరంలో కూలిన ఆ ట్యాంకర్‌ ఇరాన్‌కు చెందినట్లు ప్రాథమిక సమాచారం.  పేలుడు తర్వాత మంటలు చెలరేగి, సముద్రంలో చమురు వ్యాపించడంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. కువైట్, యుఎఇ, శ్రీలంక తీరప్రాంతాలకు ఈ చమురు లీక్ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం, ఇరాన్ మిలిటరీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పేలుడు ఆ యుద్ధానికి సంబంధించి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యూఏఈ, కువైట్ అధికారులు అత్యవసర చర్యలు ప్రారంభించారు. సముద్రంలో చమురు వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. ఈ లీక్ వల్ల సముద్ర జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా రక్షణ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇరాన్ మిలిటరీ ఈ పేలుడులో తమ ప్రమేయం లేదని ప్రకటించింది. అయితే, యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మరింత ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)