Breaking News

నిరసనలతో దద్దరిల్లిన ఫ్రాన్స్‌

Published on Sun, 10/25/2026 - 05:35

పారిస్‌:  ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ సహా ప్రధాన నగరాలు శనివారం నిరసనల ర్యాలీలు, ఆందోళనలతో దద్దరిల్లాయి. పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేకపోవడం, జీవన వ్యయం భారీగా పెరుగుతుండడం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడంపై జనం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అసమర్థతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వారు. 

పలు నగరాల్లో జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. కనీసం 1,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా చర్యల్లో వేల సంఖ్యలో జవాన్లను మోహరించారు. పారిస్‌లో లక్ష మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నగరంలో ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ నిరసనకారులు లెక్కచేయలేదు.

 1.10 లక్షల మంది తరలివచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో 4.10 లక్షల మంది పాల్గొన్నారని ఫ్రాన్స్‌ ప్రభుత్వం వెల్లడించింది. లియోన్, క్లెర్మాంట్‌–ఫెర్రాండ్, స్ట్రాస్‌బర్గ్‌తో సహా పలు నగరాల్లో ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. 

పోలీసులు బలప్రయోగం చేయడంతో పలువురు గాయపడ్డారు. పారిస్‌లో 64 మందిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్‌ కార్యాలయం తెలిపింది. అరెస్టయిన వారిలో ఆరుగురు మైనర్లు సైతం ఉన్నారు. ఆయుధాలతో నేరాలకు పాల్పడటం, హింసకు, ఆస్తి నష్టానికి పాల్పడే బృందంలో ఉండడం వంటి అభియోగాలతో అరెస్టు జరిగాయి. 

నిరసనల సందర్భంగా పలువురు యువతీ యువకులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. 27 ఏళ్ల కమిల్‌ చెస్నియర్‌ అనే యువతి మాట్లాడుతూ... ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ తనకు ఇంకా ఉద్యోగం దొరకలేదని చెప్పారు. తనలాంటి వాళ్లు లక్షల మంది చాలామంది ఉన్నారని తెలిపారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తన లాంటి వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో తమ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు.  

31న భారీ నిరసనకు పిలుపు  
పారిస్‌కు ఆగ్నేయంగా ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో సిబ్బంది కొరతపై గత నెలలో ప్రారంభమైన నిరసన నేడు దేశవ్యాప్తంగా వ్యాపించింది. మెరుగైన పాఠశాలలు కావాలని కోరుతున్న విద్యార్థులు, అధిక వేతనాలు, పెన్షన్లు కోరుతున్న కారి్మకులు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్‌విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో రిటైరైన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం వల్ల ప్రభుత్వ మాధ్యమిక, ఉన్న త పాఠశాలలు 15.4 మిలియన్ల బోధనా గంటలను కోల్పోయాయి. ఇది నిర్ణిత బోధనా సమ యంలో 7.5 శాతానికి సమానం. 

ఫ్రాన్స్‌లో ఇంధన ధరలు గత ఏడాదితో పోలిస్తే సెపె్టంబర్‌లో 21.3 శాతం అధికంగా ఉన్నాయి. ఇది మొత్తం ద్రవ్యోల్బణం 3.1 శాతానికి చేరడానికి దోహదపడింది. అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ శుక్రవారం ఉన్నత పాఠశాల ప్రతినిధులతో సమావేశ మయ్యారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టేదాకా వెనక్కి తగ్గబోమని నిరసనకారులు తేల్చిచెప్పారు. నిరసన తెలిపే హక్కును పరిరక్షించుకోవడానికి ఉద్యమ నిర్వాహకులు అక్టోబర్‌ 31న భారీ నిరసనలకు పిలుపునిచ్చారు.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)