Breaking News

పాకిస్తాన్‌ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?

Published on Sun, 10/01/2023 - 13:43

మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది.

మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్‌  సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. 

అయితే పాకిస్తాన్‌ ప్రజలు మార్ఖోర్‌లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్‌ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. 

మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి  ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్‌ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు.
ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్‌ భవితవ్యం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)