Breaking News

ఫేస్‌బుక్‌లో జుకర్‌ బర్గ్‌ బ్యాన్‌.. కేసేసిన జుకర్‌ బర్గ్‌

Published on Fri, 09/05/2025 - 12:31

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌లో తనని బ్యాన్‌చేయడంపై జుకర్‌ బర్గ్‌ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది.  ఇంతకీ.. ఫేస్‌బుక్‌ తనని బ్యాన్‌ చేయడంపై జుకర్‌ బర్గ్‌ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా?  

అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్‌బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్‌బుక్‌) తన అకౌంట్‌ను బ్యాన్‌ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ న్యాయవాది పేరు మార్క్‌ జుకర్ బర్గ్‌. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి  తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం  11వేల డాలర్ల కంటే ఎక్కువ  మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్‌బుక్‌ బ్లాక్‌ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది.  తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.

ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్‌కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్‌బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’  అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా.   

డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్‌బుక్‌ నా అకౌంట్‌ను బ్యాన్‌ చేయడంతో బిజినెస్‌ను కోల్పోయాను.  iammarkzuckerberg.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్‌లైన్‌లో క్లయింట్స్‌కాల్స్‌ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని  కోర్టులో వాపోతున్నారు. 

‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా  నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్‌బర్గ్‌ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్‌ చేయడం తగదు అని అన్నారు.  

ఈ సందర్భంగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్‌ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్‌బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్‌ స్టీవెన్‌ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్‌బర్గ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)