‘నా భార్య, తండ్రి కలసి నన్ను వంచించారు’

Published on Thu, 06/01/2023 - 14:00

ఒక వ్యక్తి తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాన్ని ఈ ప్రపంచంతో పంచుకున్నాడు. తాను అమితంగా ప్రేమించిన తన భార్య తనను ఘోరంగా మోసగించిందంటూ తన బాధను వెళ్లగక్కాడు. తన భార్య తన తండ్రితో తిరుగుతున్నదని తెలుసుకుని అతను నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పుడు తన భార్య తన తండ్రి కారణంగా గర్భం ధరించిందని తెలుసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నాడు.  

ఆ వ్యక్తి పేరు డెక్లాన్‌ ఫులర్‌. తన 22 ఏళ్ల భార్య స్టెఫనీ తనను మోసగించిందని తెలియగానే అతనికి కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లయ్యింది. ఆమె తన 44 ఏళ్ల తండ్రి డైరెన్‌తో సంబంధం పెట్టుకుందని తెలిసి  అతను తల్లడిల్లిపోయాడు. ది సన్‌ రిపోర్టును అనుసరించి ఈ కుటుంబం బ్రిటన్‌లో ఉంటోంది. 22 ఏళ్ల డెక్లాన్‌, స్టెఫనీలకు రెండేళ్ల కుమార్తె విలో కూడా ఉంది. బాధితుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ తాను మధ్యాహ్నం సమయంలో తన భార్య, తండ్రి కలసి బెడ్‌రూమ్‌లో సరసాలు ఆడటాన్ని చూశానని తెలిపారు.

అయితే స్టెఫనీ దీని గురించి మాట్లాడుతూ తాను, తన మామగారితో పాటు ఆ సమయంలో టీవీ చూస్తున్నానని తెలిపింది. అయితే తన తండ్రి కూడా తనను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. తన తండ్రి గతంలో తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడని, అయినా తిరిగి తమ ఇంటికి వచ్చివుంటున్నాడన్నారు. పైగా తన భార్య, తన తండ్రి కలసి ఉండటాన్ని చూశాన్నారు. త్వరలో తన భార్య కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నదని అన్నారు. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తమ కుటుంబం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా త్వరలో పుట్టబోయే కవలలకు డెక్లాన్‌ సవతి సోదరుడు కానున్నాడు. అలాగే అతని కుమార్తె విలో ఆ చిన్నారులకు ఆంటీ కాబోతోంది. ఇటువంటి పరిస్థితులను నమ్మలేకపోతున్నానని డెక్లాన్‌ వాపోతున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)