Breaking News

వివాదాస్పద జెండా.. భారత్‌కు మాల్దీవుల మంత్రి క్షమాపణలు

Published on Mon, 04/08/2024 - 13:20

మాలె: భారత్‌తో దౌత్యసంబంధమైన వివాదం కొనసాగుతన్న వేళ మాల్దీవుల మంత్రి మరియం షియునా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఓ పోస్టు మరోసారి వివాదాస్పదమైంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి..  ఆమె సెస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇటీవల ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ వివాదాస్పదం కావటంతో క్షమాపణలు తెలిపారు. మరియం ఇటీవల ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఓ పోస్టులోని ఫొటో భారత జాతీయ జెండాలోని అశోకచక్రాన్ని పోలి ఉండటం వివాదం అయింది. 

‘నేను ఇటీవల ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఓ పోస్టుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. నా పోస్ట్‌లోని కంటెంట్‌ వల్ల ఎవరినైనా కించపరిచినట్లు అయితే ఇవే నా క్షమాపణలు. నేను ఆ పోస్ట్‌ మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని విమర్శిస్తూ ఓ ఫొటో పెట్టాను.  అయితే అది  భారతీయ జెండాను పోలినట్లు ఉండటం నా దృష్టికి వచ్చింది.

.. అందుకే వెంటనే ఆ పోస్ట్‌ డిలీట్‌ చేశా. అది నేను ఉద్దేశపూర్వంగా పెట్టిన ఫొటో కాదు. ఆ ఫొటోలో ఏదైనా అపార్థం కలిగించినందుకు నేను చింతిస్తున్నా. మాల్దీవుల భారత్‌తో సంబంధాలను గౌరవిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా సున్నితమైన అంశాను పోస్ట్‌ చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటాను’ అని మరియం షియునా క్షమాపణ చెబుతా వివరణ  ఇచ్చారు.

డిలీట్‌ చేసిన పోస్ట్‌లో ఏం ఉంది?
మాల్దీవుల అధికార పార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్ (పీఎంసీ) నేత, మంత్రి మరియం ప్రతిపక్ష పార్టీ  మాల్దీవీయన్‌ డెమోక్రటిక్‌ పార్టీ ( ఎండీపీ)ని టార్గెట్‌ చేస్తూ..  ఆ పార్టీ లోగోను మార్పు చేస్తూ ఒక ఫొటోతో పోస్ట్‌ పెట్టారు. అయితే ఆ ఫొటో భారత్‌ జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని పోలి ఉండటం గమనార్హం. దీంతో పోస్ట్‌ వైరల్‌ అయి ఆమె విమర్శల పాలు అయ్యారు.

ఈ విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. అయితే  తాజాగా ఆ పోస్ట్‌పై మరియం భారత్‌కు క్షమాపణలు తెలిపారు. ఇక.. భారత ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ లక్ష్యదీప్‌ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రుల్లో మరియం ఒకరు. అప్పుడు ఈ విషయంపై మాల్దీవుల ప్రభుత్వం ఆ ముగ్గురు మం‍త్రులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)