Breaking News

అమెరికా అంతటా హై అలర్ట్‌.. ఇరాన్‌పై దాడుల ఫలితం

Published on Sun, 06/22/2025 - 11:14

వాషింగ్టన్‌: అమెరికా తాజాగా ఇరాన్‌లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, దాడులను చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా,  ఇజ్రాయెల్ హై అలర్ట్‌లో ఉన్నాయి. మూడు ఇరానియన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన దరిమాలా న్యూయార్క్, వాషింగ్టన్‌తో సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఇరాన్‌లో జరుగుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇక్కడి మతపరమైన, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాలకు అదనపు  బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు.  అలాగే కొలంబియాలోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు, నిఘాను పర్యవేక్షించడానికి, సమాఖ్య చట్ట అమలు భాగస్వాములతో సమన్వయ చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్‌లోని అణు సౌకర్యాలపై అమెరికన్ సైన్యం విజయవంతమైన దాడి నిర్వహించిందని,ఇది ప్రపంచానికి చారిత్రక క్షణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరాన్‌ ఈ దాడులపై స్పందిస్తూ,  అమెరికా వైమానిక దాడులో స్థానికులెవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదని పేర్కొంది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా మరింత అప్రమత్తం అయ్యింది.  దేశంలోని వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంపూర్ణ సమన్వయంతో ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.

ఇది కూడా చదవండి: ధ్వంసమైన ఇరాన్‌ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే..

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)