Breaking News

ఘోర ప్రమాదం మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు, పెళ్లి వాయిదా

Published on Tue, 12/23/2025 - 18:44

ఫుట్‌బాల్‌ లెజెండ్‌ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.

ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి.  అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.

 

లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్‌. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో ​​వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్‌ ప్రియులను ఆకర్షించింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)