Breaking News

కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్‌

Published on Wed, 10/30/2024 - 17:02

టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో  పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్‌ఇన్ సర్వే వెల్లడించింది. 

గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని  లింక్డ్‌ఇన్‌ విభాగం  ‘వర్క్ చేంజ్ స్నాప్‌షాట్’ తెలిపింది.

‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు​, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్‌ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. 

ఇక ఏఐతో  సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్‌ఇన్‌ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్‌ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. 

అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్‌ఆర్‌ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని  చేస్తున్నారని వెల్లడించింది.

‘‘ప్రస్తుతం సమయంలో వర్క్‌ ప్లేస్‌లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్‌ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో  కొన్ని బిజినెస్‌లు పరిశీలన చేస్తున్నాయి’ అని  లింక్డ్‌ఇన్ (యూకే)  మేనేజర్ జానైన్ చాంబర్లిన్  అభిప్రాయడ్డారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?