Breaking News

దాడులు కొనసాగితే హిందువులకు ప్రమాదమే?

Published on Tue, 02/10/2026 - 10:49

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్కా ప్రణాళిక ప్రకారమే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాయి.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో ఆ దేశంలో మైనార్టీలపై ప్రత్యేకించి హిందువులపై పెద్దఎత్తున దాడులు చేసి చంపారు. దీనిపై భారత్ సైతం ఎన్ని సార్లు స్పందించిన పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

"హిందూ అడ్వాన్సింగ్ ఉమన్ రైట్స్" అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడులకు  నిరసనగా మద్దతు కూడగట్టింది. దాదాపు 15 దేశాలకు చెందిన 125 సంస్థల సహకారంతో ఐక్యరాజ్య సమితికి  లేఖ రాసింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పక్కా ప్రణాళిక ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని తక్షణమే వాటిని నివారించాల్సిన అవసరం ఉందని కోరింది. ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ తో పాటు భారత్ ఇతర దేశాలు, సంస్థలు జోక్యం చేసుకోవాలని తెలిపింది.

ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఆ దేశంలోని మైనార్టీలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2024లో షేక్ హాసీనా బంగ్లాదేశ్‌ను వదిలిన నాటి నుంచి ఆ దేశంలో మైనార్టీలపై విపరీతంగా దాడులు తీవ్రంగా జరుగుతన్నాయి. హత్యలు, ఆలయాలపై దాడి, ఆస్తుల ఆక్రమణ ఇలా ఎన్నో అఘాయిత్యాలతో ఆ దేశంలోని హిందువులు భయభ్రాంతులకు గురువుతున్నారు. అయితే  బంగ్లాదేశ్‌లో రేపు ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)