Breaking News

ఆస్ట్రేలియాలో లేబర్‌ పార్టీ ఘన విజయం

Published on Sun, 05/04/2025 - 01:05

మెల్‌బోర్న్‌:  ఆస్ట్రేలియా ఫెడరల్‌ ఎన్నికల్లో అధికార లేబర్‌ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాలో గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డుకెక్కారు. అల్బనీస్‌ మరో మూడేళ్లపాటు ప్రధానిగా కొనసాగబోతున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో మొత్తం 150 సీట్లు ఉండగా, శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ కడపటి వార్తలు అందేసరికి 83 సీట్లు గెలుచుకుంది. స్పష్టమైన మెజార్టీ సాధించింది. 

ప్రతిపక్ష లిబరల్‌ నేషనల్‌ పార్టీ 14 స్థానాలకే పరిమితమైంది. లిబరల్‌ పార్టీ 13, నేషనల్‌ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. కాటర్‌ పార్టీకి ఒక స్థానం, సెంట్రల్‌ అలయెన్స్‌కు ఒక స్థానం దక్కింది. మరికొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష లిబరల్‌ నేషనల్‌ పార్టీ అగ్రనేత పీటర్‌ క్రెయిగ్‌ డటన్‌ తమ ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో తాము సరిగ్గా పని చేయలేకపోయామని అన్నారు. ఓటమికి బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని చెప్పారు. 

ప్రధాని అల్బనీస్‌కు ఫోన్‌చేసి, అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. లేబర్‌ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని, దాన్ని తాము గుర్తిస్తున్నామని వెల్లడించారు. బ్రిస్బేన్‌ నియోజకవర్గంలో పీటర్‌ క్రెయిగ్‌ డటన్‌ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ ఆయనపై లేబర్‌ పార్టీ అభ్యర్థి అలీ ఫ్రాన్స్‌ విజయం సాధించారు. ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఇంధనం విధానం, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి అంశాలే ప్రతిపాదికగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 

తాను ప్రధానమంత్రి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దారిలో నడవనున్నట్లు పీటర్‌ క్రెయిగ్‌ డటన్‌ సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేస్తానని, ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తానని ప్రకటించారు. ఆయన విధానాల పట్ల ప్రజలు విముఖత చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఆంథోనీ అల్బనీస్‌ మరోసారి నెగ్గే అవకాశం ఉందని ముందే అంచనాలు వెలువడ్డాయి.  ఆంథోనీ నార్మన్‌ అల్బనీస్‌ 1963 మార్చి 2న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. 

1996లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2019 నుంచి లేబర్‌ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. 2019 నుంచి 2022 దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2022లో ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో మూడేళ్లు పదవిలో కొనసాగబోతున్నారు.  ‘‘ఆస్ట్రేలియా విలువలకు ప్రజలు మరోసారి పట్టంకట్టారు. వాటికి అనుగుణంగానే నూతన ప్రభుత్వ పాలన సాగుతుంది. అంతేతప్ప ఎవరినీ అనుసరించబోం. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ వీలైనంత త్వరలో అమలు చేసి చూపిస్తా’’  – విజయోత్సవ ప్రసంగంలో అల్బనీస్‌  

మోదీ అభినందనలు  
అల్బనీస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్‌–ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అల్బనీస్‌ నాయకత్వ సామర్థ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజల తిరుగులేని విశ్వాసానికి ఈ విజయమే తార్కాణమని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యాన్ని భారత్‌–ఆస్ట్రేలియా బలంగా కోరుకుంటున్నాయని మోదీ స్పష్టంచేశారు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)