Breaking News

పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?

Published on Mon, 07/22/2024 - 17:44

పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.

తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్‌ దేశంలో జరిగింది.  అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్‌గా మారింది.

 కువైట్‌లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే  పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ  పరుష పదజాలానికి దిగాడు.

తనకు సాయం  చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది.  దీని న్యాయమూర్తి అంగీకరించి  వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.

అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్‌లో  ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)