Breaking News

ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ పార్థివదేహం

Published on Thu, 07/09/2026 - 19:45

టెహ్రాన్‌: ఇరాన్‌ మజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘట్టం తుదిదశకు చేరుకుంది. మష్హాద్‌లోని ఇమామ్‌ రెజా పవిత్రక్షేత్రంలో పార్థివదేహం ఖననం చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు లక్షల సంఖ్యలో జనం మష్హాద్‌ బాట పట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఆ నగర వీధులన్నీ జనసముద్రంగా మారాయి.

ఈ రోజు ఉదయం ఇరాక్‌లోని నజాప్‌ విమానాశ్రయం నుంచి ఖమేనీ భౌతికకాయం ఉన్న విమానం మష్హాద్‌ నగరానికి బయిలుదేరింది. ఈ అంత్యక్రియల విమాన ప్రయాణానికి అత్యంత భారీ భద్రత,అధికారిక ప్రోటోకాల్‌ను కేటాయించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్వయంగా ఆ విమానంలో ఖమేనీ భౌతికకాయంతో పాటు ప్రయాణించి ఎస్కార్ట్‌గా నిలిచారు.

ఫైటర్  జెట్స్ ఎస్కార్ట్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భౌతిక కాయం తరలిస్తున్న విమానానికి అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. వాయుతలంలో ఆ విమానానికి ఇరు దేశాల వైమానికి దళాలు ఫైటర్‌ జెట్స్‌తో భద్రత కల్పించాయి. మష్హాద్ చేరుకున్న అనంతరం  అక్కడి నుండి హెలికాప్టర్ల ద్వారా కర్బలాకు తరలించే సమయంలో కూడా భారీ సైనిక ఎస్కార్ట్ మధ్యే శవపేటికను తరలించారు.

కాగా ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు తీవ్ర కలకలం రేపాయి.  ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్సులో ఉన్న రైల్వే వంతెనపై దాడులు చేసింది. దీంతో టెహ్రాన్‌- మష్హాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Iranian Fighter Jets escorted the plane carrying the caskets of Ayatollah Khamenei and his family

This explains reports of the jet activity I was reading. https://t.co/7TxUPwnwD4 pic.twitter.com/gfTXLUwe21

— Ryan Rozbiani (@RyanRozbiani) July 9, 2026 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)