Breaking News

ఇరాన్ - అమెరికా వార్ టెన్షన్

Published on Sat, 02/21/2026 - 21:17

ఇరాన్, అమెరికా వార్ టెన్షన్ రోజురోజుకూ పెరుగుతుంది. ఏక్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న విదేశీ పౌరుల కోసం ఆ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్బియా, స్వీడన్  దేశాలు ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి.

ప్రస్తుతం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చే రెండువారాల్లోగా  అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇది వరకే ట్రంప్ అమెరికా నావికాదళాన్ని ఇరాన్ కు సమీపంలో మోహరించిన సంగతి తెలిసిందే. ఏదైనా తేడాలొస్తే ఏ క్షణానైనా దాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీంతో ఇరాన్ లోని తమ దేశ పౌరుల కోసం ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. వారిని వెనక్కి రావాల్సిందిగా  ఆదేశాలు ఇస్తున్నాయి. 

సెర్బియా దేశం ఈ విషయంలో తమ దేశ  పౌరులకు స్పష్టమైన ఆ దేశాలు ఇచ్చింది. ఇరాన్ లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నందున తమ దేశ పౌరులెవరూ అక్కడి వెళ్లకూడదని ఆదేశించింది. అంతేకాకుండా అక్కడ ఉన్న వారు వీలైనంత త్వరగా ఇరాన్ ని వదలాలని అక్కడి విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా స్వీడన్ సైతం తమ దేశస్థులు వీలైనంత త్వరగా ఇరాన్ ని వీడాలని తెలిపింది. బల్కాన్ కంట్రీ గత నెలలోనే ఆ దేశ పౌరులు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది.

ఇదిలా ఉండగా తాజాగా ఆక్సియోస్ (Axios) నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్‌ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు ఆక్సియోస్ నివేదిక ప్రచురించింది. దీంతో ఈఅంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు ఏ జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)