72 గంటలపాటు చెట్టును కౌగిలించుకుని.. 

Published on Mon, 12/15/2025 - 06:06

నైరోబీ: కెన్యా పర్యావరణ ఉద్యమకారిణి ట్రంఫెనా ముతోని ప్రపంచ రికార్డు సృష్టించారు. నిద్రాహారాలు మాని 72 గంటలపాటు ఒక చెట్టును కౌగిలించుకుని ఉండిపోయారు. గతంలో 48 గంటల పాటు చెట్టును కౌగిలించుకుని తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టారు. నౌరీ పట్టణంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో చెట్టును ఆమె ఇందుకు ఎంచుకున్నారు.

 అడవుల నరికివేత, మృగాల హత్యలకు నిరసనగా, యువతకు పర్యావరణ సంరక్షణ విలువను తెలపడానికి ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. ఆమె నిరసనకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచి్చంది. చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒకానొక దశలో ఆమె నిద్రలోకి జారుకోగా.. మద్దతుదారులు మేల్కొలిపారు. కొందరైతే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పరిశీలకులకు ఆమె ఫీజు చెల్లించడానికి ముందుకొచ్చారు. 

ఈ సమయంలో ఆమె నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగుల్లో ఉన్న ఊలు టీషర్ట్‌ను ధరించారు. నలుపు ఆఫ్రికన్‌ శక్తని, ఆకుపచ్చ అడవులకు, ఆశకు ప్రతిరూమని, ఇక ఎరుపు ప్రతిఘటనకు, నీలం నీటికి గుర్తని.. చెప్పారు. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన పెంచడమే తన నిరసన లక్ష్యమని చెప్పారు. తక్కువ కార్బన్‌ ఉద్గారాలను విడుదల చేసే తమ దేశాలు.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆఫ్రికన్‌ దేశాలు ఆరోపిస్తున్నాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)