Breaking News

బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం

Published on Fri, 09/06/2024 - 15:38

తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్‌లో మంటలు చెలరేగి  చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.


కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.

హిల్‌సైడ్‌ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.

తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు.

 

 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్‌ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ స్కూల్‌లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు.

 

ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు.


 
గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్‌లో ఓ స్కూల్‌లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)