ట్రూడో కవ్వింపు చర్యలు.. భారత్‌పై యూఏఈ అధ్యక్షునితో చర్చ

Published on Mon, 10/09/2023 - 11:25

ఒట్టావా: భారత్‌-కెనడా మధ్య వివాదం చెలరేగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌తో భారత్‌-కెనడా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై మాట్లాడారు. అలాగే చట్టాలకు మద్దతునివ్వడం, గౌరవించడంపై ముచ్చటించారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై కూడా ట్రూడో మాట్లాడారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షునితో మొబైల్‌లో మాట్లాడారు.

'ఈ రోజు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాను. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ.. సాధారణ పౌరుల జీవితాలను కాపాడాల్సిన అవసరంపై మాట్లాడాను. ఇండియాతో సంబంధాలపై కూడా చర్చించాం.. చట్టాలకు మద్దతునిస్తూ, గౌరవించడంపై చర్చించాం.' అని ట్రూడో ట్విట్ చేశారు.

ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్‌తో భారత్‌-కెనడా మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ట్రూడో చర్చించారు. దౌత్య సంబంధాలు, చట్టాల గురించి ఇరువురూ మాట్లాడుకున్నారు. అంతర్జాతీయ సంబంధాలను యూకే కట్టుబడి ఉంటుందని రిషి సునాక్ ఈ సందర్భంగ చెప్పారు. ఈ పరిణామాల అనంతరం మళ్లీ యూఏఈ అధ్యక్షునితో ట్రూడో భారత్ గురించి చర్చించడం గమనార్హం. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా-భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి.

ఇదీ చదవండి:  ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు

   


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)