Breaking News

చైనా మనందరినీ పరీక్షిస్తోంది: జో బైడెన్‌

Published on Sun, 09/22/2024 - 09:03

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలో నాలుగో క్వాడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. 

‘‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఇలా దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల్లో చైనా మనందరినీ పరీక్షిస్తోంది. అయితే ఈ సందర్భంలో దేశాల మధ్య పోటీకి దౌత్యం అవసరమని మేము నమ్ముతున్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సైతం ఆ దేశ ప్రయోజనాలను దూకుడుగా కొనసాగించేందుకు ఇతర దేశాలతో దౌత్యపరమైన విధానాలు అమలు చేయడానికి యోచిస్తున్నారని విన్నాను. ముఖ్యంగా చైనాలో దేశీయ ఆర్థిక సవాళ్లపై జీ జిన్‌పింగ్‌ దృష్టి సారించారని, చైనాలో అల్లకల్లోలం తగ్గించేందుకు దృష్టి సారించారని తెలుస్తోంది’ అని అన్నారు.

క్రెడిట్స్‌:  Bloomberg Markets

దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం ప్రదర్శించడానికి దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే మొత్తం దక్షిణ చైనా సముద్రంపై తాము సార్వభౌమాధికారం కలిగి ఉన్నామని చైనా అంటున్న విషయం తెలిసిందే. అయితే చైనా వైఖరిపై  వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ ఇతర ఆగ్నేయాసియా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)