Breaking News

ఆయనో నియంత..బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు 

Published on Wed, 06/21/2023 - 07:36

అమెరికా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చారిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్  ఒక నియంత అంటూ ఏకిపాడేశారు. 

ఇదే ఏడాది మొదట్లో అమెరికా గగనతలంలో ఎగిరిన చైనా గూఢచారి విభాగానికి చెందిన బెలూన్లను పేల్చివేయడం పాపం జిన్ పింగ్ కు మింగుడుపడలేదు. ఆ బెలూన్ల నిండా రెండు బాక్సుల గూఢచారి పరికరాలు ఉన్నాయి. బెలూన్లయితే పంపించాడు కానీ తర్వాత ఏం జరిగిందన్న దానిపై ఆయనకు సమాచారం లేదు. సాధారణంగా అలాంటి సమయాల్లో నియంతలు వెర్రెక్కిపోతూ ఉంటారని, సరైన సమాచారం లేక జిన్ పింగ్ కూడా అలాంటి అయోమయ పరిస్థితిలోనే ఉండి  ఉంటారని అన్నారు.

అసలే అమెరికా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా  కొవిడ్ సమయంలో ఈ విబేధాలు మరింత పెరిగి తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా పర్యటనకు  శ్రీకారం చుట్టారు. ఈ పర్యటన సందర్బంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యి పలు కీలక అంశాల గురించి చర్చించుకున్నారు కూడా. ఈ సమావేశం ముగిసిన మరుసటి రోజే జిన్ పింగ్ ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. 

ఇది కూడా చదవండి:  అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)