Breaking News

అమెరికాలో గంజాయి బ్యాచ్‌లకు ఊరట!

Published on Fri, 05/17/2024 - 10:50

‘‘గంజాయిని కలిగి ఉన్నా..  లేదంటే సేవించినంత పని చేసినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో స్వయంగా చేసిన పోస్ట్‌ ఇది. ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్‌ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్‌ ప్రభుత్వం చెబుతోంది.

వాషింగ్టన్‌: అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని నెమ్మదిగా ఆ దేశంలో చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడినట్లయ్యింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్‌-3 డ్రగ్‌ నుంచి షెడ్యూల్‌-1 డ్రగ్‌ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చబోతున్నారన్నమాట.

అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం రూపకల్పన 1937లో జరిగింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించడం గమనార్హం. ఆ తర్వాత మైనర్‌లు డ్రగ్స్‌ బారిన పడుతున్నారనే 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌. దీని ప్రకారం గంజాయిని ఇంతకాలం షెడ్యూల్‌-1 డ్రగ్‌ కింద ఉంచారు. ఈ షెడ్యూల్‌-1 డ్రగ్స్‌లో హెరాయిన్‌, ఎల్‌ఎస్డీ, ఎక్సాట్సీ వంటివి కూడా  ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్‌ అని, వీటిని సేవించినా.. కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన ఇంతకాలం కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్‌3 డ్రగ్స్‌లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు. 

షెడ్యూల్‌-3 డ్రగ్స్‌లో కెటామైన్‌, పెయిన్‌కిలర్స్‌లో వాడే కోడైన్‌(codeine) ఉన్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో.. ఇక నుంచి గంజాయి బ్యాచ్‌లకు కాస్త ఊరట కలగనుంది.  అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే.. ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు.

వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్‌ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్‌ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే.. గంజాయిని రీక్లాసిఫై చేసే ప్రతిపాదనను మాత్రం బైడెన్‌ ప్రభుత్వం ఈ ఏప్రిల్‌ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ మాత్రం ఆ ప్రాసెస్‌ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే.. ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది.

ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్‌ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్‌సెంటర్‌ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు.

బైడెన్‌ తీసుకున్న ఈ నిర్ణయం.. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్ర ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించే దిశగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)