Breaking News

భారత్‌-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!

Published on Wed, 10/11/2023 - 18:42

భారత్‌ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, కెనడా విదేశాంగమంత్రి మెలానీ అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్‌ వార్తా పత్రిక  ఫినాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు, న్యూఢిల్లీతో దౌత్యపరమైన సంబంధాలను పునురద్ధరించేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నిన్నట్లు పేర్కొంది.

అయితే ఈ భేటీపై అటు కెనడా కానీ, ఇటు భారత్‌ కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలంటూ భారత్‌ గడువు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక ఖలిస్తానీ సానూభూతిపరుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కెనడా ఆరోపలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అనంతరం రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడాకు వీసా సేవలను భారత్‌ నిలిపి వేసింది.
చదవండి: పఠాన్‌కోట్‌ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్‌ పాకిస్థాన్‌లో హతం

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి