కెనడాలో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రధాని ట్రూడోకు షాకిచ్చిన ఎన్‌డీపీ

Published on Sat, 12/21/2024 - 11:56

అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమొక్రటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ) షాక్​ ఇచ్చింది. ట్రూడో లిబరల్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఎన్‌డీపీ నేత జగ్మీత్‌సింగ్ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు.

తాజాగా ఎన్‌డీపీ నేత జగ్మీత్‌సింగ్ ట్విట్టర్‌ వేదికగా ఒక లేఖను పోస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన..‘జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రజల కోసం కాకుండా, శక్తిమంతుల కోసం ట్రూడో పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తాం. హౌస్ ఆఫ్‌ కామన్స్‌ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం అని చెప్పుకొచ్చారు. దీంతో, కెనడా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

మరోవైపు.. కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్‌ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె, ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీల మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే కెనాడలో తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసిపోతుంది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)