Breaking News

ఉక్రెయిన్‌ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు

Published on Wed, 11/20/2024 - 20:57

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.

ఇటలీ ,గ్రీస్‌,స్పెయిన్‌లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్‌ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. 

ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్‌, స్పెయిన్‌లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)