రూ. 80 లక్షల తల్లి పెన్షన్‌ కోసం ఏ కొడుకూ చేయని పని!

Published on Thu, 11/27/2025 - 18:55

తల్లి పెన్షన్‌ కోసం ఒక కొడుకు ఎవరూ చేయని, చేయకూడని  పనికి పూనుకున్నాడు. అలా నాలుగేళ్లు మోసం చేశాడు. చివరికి  పోలీసులకు  చిక్కాడు.  కొడుకు ఘనకార్యం  ఏంటి అంటే..


ఉత్తర ఇటలీలోని బోర్గో వర్జిలియో పట్టణానికి చెందిన  నర్సు  గ్రాజియెల్లా డల్ ఓగ్లియో (85) చనిపోయింది. అయితే ఆమె చనిపోయిందని చెబితే  పెన్షన్‌ రాదేమో ననే భయంతో  ఆమె 56ఏళ్లు కొడుకు  ఎవరూ ఊహించని పనిచేశాడు చట్టబద్ధంగా తన తల్లి పెన్షన్ రావాలంటే.. తల్లి చనిపోయినట్టు ఎవరికీ తెలియకూడదని ప్లాన్‌ వేశాడు. అచ్చం ఆమెలాగే వేషం వేసుకుని అందర్నీ నమ్మించడం మొదలు పెట్టాడు. అలా వేషం మార్చుకుని గత మూడేళ్లుగా ఆమె పెన్షన్‌ పొందుతూ సుమారు రూ.  80 లక్షలు దండుకున్నాడు.  అయితే   మోసం ఎంతో కాలం దాగదు కదా.

2022లో తన తల్లి మరణించిన  తరువాత, ఆమెలానే బ్లౌజ్ ,స్కర్ట్, లిప్‌స్టిక్, విగ్‌ ధరించేవాడు.  అయితే నవంబర్ 16న, ఐడీ కార్డు రెన్యూవల్ కోసం రిజిస్ట్రీ కార్యాలయానికి  వెళ్లినపుడు అధికారులకు అనుమానం వచ్చింది.   వేషధారణలో ఏదో తేడా ఉందని గమనించారు. ఐడిలోని ఫోటోలో ఉన్న మహిళలాగే కనిపించినప్పటికీ,  మెడపై జుట్టు, భారీ మేకప్  నకిలీది అని అర్థం అయింది. దీంతో అతని పెన్షన్ స్కామ్‌ వెలుగులో వచ్చింది .అలాగే కుటుంబం  రియల్ ఎస్టేట్ , భూమి నుండి వచ్చే ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తూనే ఉన్నాడు.

ఇదీ చదవండి : స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్‌

మరి తల్లి శవాన్ని ఏం చేశాడు.
పోలీసులు కూపీ లాగడంతో తన మారువేషాన్ని అంగీకరించాడు. తన తల్లి  సహజంగానే చనిపోయిందని, అది దాచిపెట్టడానికి ఆమె శవాన్ని మమ్మీఫై చేసినట్టు ఒప్పుకున్నాడు.  దీని ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారుల ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.  నిరుద్యోగి అయిన  ఈ ఇటాలియన్ వ్యక్తిపై కేసు నమోదు చేసి,  దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ సహజ కారణాల వల్ల మరణించి ఉండవచ్చు, కానీ శవపరీక్షలో అసలు విషయం తెలుస్తుందని  విచారణ అధికారి అపోర్టి  చెప్పారు.  ఆ కుటుంబానికి ఎలాంటి  ఆర్థిక సమస్యలు లేవు .ఇది చాలా, చాలా విచారకరమైన కథ అని తెలిపారు. 

ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్‌ : పలాష్‌ మాజీ ప్రేయసి ప్రపోజల్‌ వైరల్‌
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)