Breaking News

నెతన్యాహు భారత పర్యటన రద్దు

Published on Tue, 11/25/2025 - 09:24

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్  నెతన్యాహు భారత్ పర్యటన రద్దైంది. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నెతన్యాహు తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నెతన్యాహు భారత్ పర్యటన రద్దవడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.

భారత్- ఇజ్రాయెల్ మధ్య మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఆపదలో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ ఇజ్రాయెల్ ఆపన్న హస్తం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు ఈ ఏడాది చివర్లో భారత్ రావాల్సి ఉండగా కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో బెంజిమెన్ పర్యటన రద్దుకావడం ఇది మూడోసారి. గతంలో సెప్టెంబర్ 19న ఒకరోజు పర్యటన నిమిత్తం భారత్ రావాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో సైతం బెంజిమిన్ పర్యటన రద్దైంది.

బెంజిమిన్ నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్ లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆయన ఇండియా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది. 2026లో నెతన్యాహు భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 13మంది మృతి చెందగా పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)