Breaking News

హెజ్‌బొల్లాపై పోరు: ఆరుగురి ఇజ్రాయెల్‌ సైనికులు మృతి

Published on Thu, 11/14/2024 - 07:33

జెరూసలేం: లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్‌ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్‌ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.

‘‘దక్షిణ లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్‌ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్‌ సరిహద్దుల్లో హెజ్‌బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.

 

ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్‌ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.

 

సెప్టెంబరు 23 నుంచి లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్‌ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్‌, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)