Breaking News

హమాస్‌ నేతలే లక్ష్యంగా ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడి

Published on Wed, 09/10/2025 - 03:01

దుబాయ్‌: ఖతార్‌లో ఉంటున్న హమాస్‌ నేతలే లక్ష్యంగా మంగళవారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు తెరతీసింది. రాజధాని దోహాలోని హమాస్‌ రాజకీయ ప్రధాన కార్యాలయంపై దాడి జరిపింది. దాడి అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాడిలో అజ్ఞాతంలో ఉన్న హమాస్‌ గాజా చీఫ్‌ ఖలిల్‌ అల్‌ హయ్యా కుమారుడు సహా తమ సభ్యులు ఐదుగురు చనిపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తులు త్రుటిలో తప్పించుకున్నారని తెలిపింది. తమ అంతరంగిక భద్రతా దళం అధికారి కూడా మృతుల్లో ఉన్నారని ఖతార్‌ తెలిపింది.

తామే ఈ దాడికి పాల్పడ్డామని, తమదే పూర్తి బాధ్యతని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వయంగా ప్రకటించడం గమనార్హం. జెరూసలేంలో సోమవారం ఆరుగురిని చంపిన ఘటన నేపథ్యంలోనే ఈ దాడికి పథకం వేశామన్నారు. తమకు అందిన అదనపు నిఘా సమాచారంతో హమాస్‌ నేతలే లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. దీనిపై ముందుగా అమెరికాకు సమాచారం ఇచ్చామని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా మిత్రదేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడితో సంక్షోభం మరింత ముదురుతుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోవడమే కాకుండా, బందీల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇజ్రాయెల్‌ చర్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఖతార్‌ పేర్కొంది. ఇజ్రాయెల్‌ది పిరికిపంద అని వ్యాఖ్యానించింది. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఈ దాడిని ఖండించారు. యూఏఈ, సౌదీ అరేబియా దాడిని తీవ్రంగా తప్పుబట్టాయి.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)