Breaking News

దక్షిణ లెబనాన్‌పై.. ఇజ్రాయెల్ దాడులు

Published on Sat, 02/28/2026 - 11:31

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.  ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా  హిజ్బుల్లా తీవ్రవాదులు తరుచుగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.  దక్షిణ లెబనాన్‌ లోని టెర్రరిస్టుల మౌలిక సదుపాయాల ధ్యంసమే టార్గెట్‌గా ఈ అటాక్స్ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే  ప్రస్తుతం యెమెన్‌లోని ప్రభుత్వ మద్ధతు గల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు.

దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మోహరించారు. వారి నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన పక్షంలో హౌతీలు ఇతర ఇరాన్ మిత్ర బలగాలతో (హిజ్బుల్లా వంటి) కలిసి ‘యూనిటీ ఆఫ్‌ ఫ్రంట్స్‌’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, కొత్త దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మెుత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు గంభీరంగా మారాయి. ఇటు వైపేమో ఇరాన్ అనుకూల వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులకు సిద్ధమవుతుండగా మరో వైపేమే అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్‌కు దగ్గరగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)