గాజా సొరంగంలో ఇజ్రాయెల్‌ బంధీల మృతదేహాలు

Published on Sun, 09/01/2024 - 12:56

దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఓ సొరంగంలో ఆరుగురి బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు వీరిని బంధీలు గాజా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి, ఒరి డానినో మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.

 వీరు తాము స్వాధీనం చేసుకునే కొంత సమయం ముందు హమాస్‌ మిలిటెంట్ల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి 52 ఏళ్ల ఇజ్రాయెల్‌ బంధీ ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించి వారం రోజులు గడవక ముందే ఒకేసారి ఆరుగురి మృతి దేహాలను స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ ఆరుగురిలో ఇజ్రాయెలీ-అమెరికన్‌ హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ అన్నారు. 

గోల్డ్‌బెర్గ్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైట్‌ హౌస్‌  ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రోజు.. గాజా యుద్ధాన్ని ముగించాలని బైడెన్‌ పిలుపునిచ్చారు. బందీల విడుదల, విధ్వంసమైన గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కోసం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో కొనసాగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘ గాజా ఒప్పందాన్ని ముగించగలమని  భావిస్తున్నాం. ఇరువురు సంబంధిత ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు చెప్పారాయన.

ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 40,691 మంది మరణించగా.. 94,060 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ మిలిటెంట్‌ గ్రూప్‌ చేసిన 1,200 మందిని మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)