Breaking News

ఇజ్రాయెల్‌-హమాస్‌ ముఖాముఖి పోరు

Published on Mon, 10/23/2023 - 05:51

గాజా:  ఇన్నాళ్లూ పరస్పరం వైమానిక దాడులకు, రాకెట్‌ దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్‌ సైనికులు, హామస్‌ మిలిటెంట్లు తొలిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. గాజా భూభాగంలో ఇరుపక్షాల మధ్య ముఖాముఖి పోరు సాగిందని హమాస్‌ సైనిక విభాగం అల్‌–ఖసమ్‌ బ్రిగేడ్స్‌ ఆదివారం వెల్లడించింది. ఈ నెల 7న యుద్ధం మొదలైన తర్వాత భూభాగంపైన ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ప్రత్యక్షంగా ఘర్షణ జరగడం ఇదే మొదటిసారి.

తమ భూభాగంలోకి దూసుకొచి్చన ఇజ్రాయెల్‌ మిలటరీకి చెందిన రెండు బుల్డోజర్లను, ఒక యుద్ధ ట్యాంక్‌ను ధ్వంసం చేశామని హమాస్‌ మిలిటెంట్లు ప్రకటించారు. తమ ఎదురుదాడిని తట్టుకోలేక ఇజ్రాయెల్‌ సైన్యం వాహనాలు వదిలేసి కాలినడకన వారి సరిహద్దు వైపు పలాయనం చిత్తగించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్‌–ఖసమ్‌ బ్రిగేడ్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఖాన్‌ యూనిస్‌ సిటీలో ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని తెలియజేసింది.

అల్‌–ఖసమ్‌ బ్రిగేడ్స్‌ ప్రకటనపై ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిస్పందించింది. దక్షిణ గాజాలో సెక్యూరిటీ ఫెన్స్‌ వద్ద విధి నిర్వహణలో ఉన్న తమ బలగాలపై స్వల్పంగా కాల్పులు జరిగాయని స్పష్టంచేసింది. కాల్పులు జరిపిన మిలిటెంట్లపై తమ యుద్ధ ట్యాంకు నుంచి ప్రతిదాడి చేశామని పేర్కొంది. దాంతో వారంతా చెల్లాచెదురు అయ్యారని వెల్లడించింది. గాజా భూభాగంలో తమ సేనలు మకాం వేసిన మాట వాస్తవమేనని ఇజ్రాయెల్‌ మరోసారి అంగీకరించింది. ఈ నెల 13న కూడా ఇదే మాట చెప్పింది. కానీ, హమాస్‌తో ముఖాముఖి ఘర్షణ జరిగినట్లు వెల్లడించడం మాత్రం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో హమాస్‌ ప్రముఖ నేత ముహమ్మద్‌ కటామాష్‌ హతమయ్యాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)