Breaking News

Israel Hamas War: చైనాలో ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై కత్తితో దాడి

Published on Fri, 10/13/2023 - 16:52

ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బందిపై చైనాలో దాడి జరిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుల చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తను కత్తితో పొడిచినట్లు తెలిపింది.  గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చిక్సి అందిస్తున్నారని..  ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది.

అయితే ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ఏ విధమైన ప్రకటన చేయలేదు. బీజింగ్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఓ వైపు హమాస్‌ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలు, యూదులు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది.

ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి ఇజ్రాయెల్, చైనా మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్ దాడులను చైనా ఖండించకపోవడంపై బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.  ప్రస్తుతం యుద్ధ పరిణామాల పట్ల చైనా వైఖరికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 
చదవండి: తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు

మరోవైపు వారం రోజులుగా గాజా, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజా సరిహద్దు వెంట ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న హమాస్‌ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేస్తోంది. బాంబ్‌, వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ఇప్పటి వరకు 6 వేల బాంబులను గాజాపై ప్రయోగించింది. గాజాస్ట్రిప్‌లోని ఇళ్ల కింద ఉన్న టన్నెల్స్‌లో హమాస్‌ టెర్రరిస్టులు దాక్కుడటంతో ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన చేసింది.

24 గంటల్లో  సిటీ వదిలి దక్షిణం వైపు వెళ్లాలని, ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్‌ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా హెచ్చరికలు జారీ చేసిందిమరోవైపు ఆహారం, ఇంధనం, నీరు, కరెంట్‌ నిలిపివేయడంతో గాజాలో పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే ఇజ్రాయెల్‌ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళ వ్యక్తం చేసింది. పౌరుల తరలి వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది.
చదవండి: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ పౌరులు, విదేశీ బందీల మృతి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)