Israel-Hamas war: నెతన్యాహు, హమాస్‌ నాయకుల అరెస్టుకు ఆదేశాలు కోరతా

Published on Tue, 05/21/2024 - 05:18

జెరూసలెం: అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నుంచి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, హమాస్‌ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు కోరనున్నట్లు చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ సోమవారం వెల్లడించారు. గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్, హమాస్‌ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్‌ దీఫ్, ఇస్మాయిల్‌ హనియేహ్‌లు బాధ్యులని ఆయన అన్నారు.

 ముగ్గురు జడ్జిల ప్యానెల్‌ అరెస్టు వారెంట్లు, కేసు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఇలాంటి వాటిల్లో నిర్ణయానికి జడ్జిలు రెండు నెలల సమయం తీసుకుంటారు. వారెంట్లు జారీ అయినా నెతన్యాహు, గాలంట్‌లకు వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ నెతన్యాహు, గాలంట్‌లు విదేశీ పర్యటనలకు వెళ్లడం కష్టమవుతుంది. వారెంట్లు కోరడాన్ని యూదు వ్యతిరేక చర్యగా నెతన్యాహు అభివర్ణించారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)