Breaking News

హౌతీల మిసైల్‌ కూల్చివేసిన ఇజ్రాయెల్‌

Published on Sun, 07/21/2024 - 13:25

జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్‌ హొదైదా పోర్టును ఇజ్రాయెల్‌  ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్‌ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) దళాలు మధ్యలోనే  దానిని కూల్చివేశాయి.

 

తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో  కూల్చివేసినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌ నగరంలో ఇప్పటికీ  క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్‌డోమ్‌) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్‌అవీవ్‌పై హౌతీలు జరిపిన డ్రోన్‌ దాడికి ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై  ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది. 

మరోవైపు ఐడీఎఫ్‌ దళాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్‌ మీడియా ధృవీకరించింది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)