Breaking News

అమెరికా ఎఫెక్ట్‌.. ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపించిన ఇరాన్‌

Published on Sun, 06/22/2025 - 10:37

Iran-Israel Conflict Updates..

ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడి..

  • బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి ఇరాన్‌ దాడి..
  • ఇజ్రాయెల్ అంతటా జరిగిన దాడుల్లో 11 మందికి గాయాలు
  • విమానాశ్రయంలో సహాయక చర్యలు ప్రారంభం.
  • బాధిత ప్రాంతాలలో అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 

ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ విధింపు..

  • ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇరాన్ దాడులు
  • ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం
  • ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో భారీ పేలుడు
  • ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు
  • మధ్య ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసం
  • ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం.
  • ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసం
  • కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం
  • ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనున్న ఇరాన్ నిర్ణయం
  • అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు పిలుపునిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు

ఇరాన్‌ భీకర దాడులు..
ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిన వేళ.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్‌ జెరూసలేం, టెలీ అవీవ్‌ టార్గెట్‌గా ఇరాన్‌ మరోసారి భారీ దాడులు చేసింది. భారీ క్షిపణుల కారణంగా పేలుళ్లు జరిగాయి. ముప్పెట దాడితో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపించింది. ఇరాన్‌ దాడుల సందర్భంగా టెలీ అవీవ్‌ సహ పలు ప్రాంతాల్లో సెరన్లు మోగాయి. దాదాపు 400 ప్రాంతాల్లో సెరన్లు మోగినట్టు తెలుస్తోంది. దీంతో, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. 

ఇజ్రాయెల్ పౌరులకు హెచ్చరిక
ఇరాన్‌ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. పౌరులందరూ షెల్టర్‌ హోమ్స్‌లోనే ఉండాలని..  హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను పాటించాలని సూచించింది. క్షిపణి దాడుల కారణంగా అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఇజ్రాయెల్ గగనతలం మూసివేత..
ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఈజిప్ట్, జోర్డాన్‌తో భూ సరిహద్దు క్రాసింగ్‌లు తదుపరి నోటీసు వచ్చే వరకు తెరిచే ఉంటాయని తెలిపింది.

 

అమెరికాలో హైఅలర్ట్‌.. 
ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతిగా టెహ్రాన్‌ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్‌తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇరాన్‌లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 
 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)