Breaking News

ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఒకే కుటుంబంలో 14 మంది మృతి

Published on Fri, 01/05/2024 - 08:45

ఖాన్‌యూనిస్‌: ఇజ్రాయెల్‌ నిరంతరాయంగా కనికరం లేకుండా జరుపుతున్న దాడుల్లో పాలస్తీనియన్ల కుటుంబాలు సమిధలవుతున్నాయి. గురువారం ఖాన్‌యూనిస్‌కు సమీపంలోని ఓ ఇంటిపై జరిగిన దాడితో అందులో సలాహ్‌ కుటుంబానికి చెందిన 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో అయిదేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. వీరంతా గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు.

హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. అటు.. యుద్ధం లెబనాన్ రాజధాని బీరూట్‌ వైపు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని ఇజ్రాయెల్ సేనలు మంగళవారం హతమార్చారు. అరూరి అంగరక్షకులు కూడా ఈ యుద్ధంలో మరణించారు. ఈ ఘటన అనంతరం ఇరువర్గాల మధ్య పరిస్థితులు మరింత వేడెక్కాయి. బందీల అప్పగింతపై చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారింది.       

గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష‍్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది ప్రాణాలు కోల్పోయారు.      

ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)