Breaking News

Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు

Published on Wed, 10/18/2023 - 17:41

గాజాలోని ఆసుప్రతిపై దాడి అనంతరం హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 900 మంది గాయ‌ప‌డ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

తాజాగా హాస్పిట‌ల్  ఘటనపై తాము బాధ్యులం కాదని చెబుతూ.. రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.  ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని  హమాస్‌ ఆరోపిస్తుండగా.. దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని, తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది.  ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని  పాలస్తీనా  మిలిటెంట్లను నిందించింది.
చదవండి: ఇజ్రాయెల్‌కు మా పూర్తి మద్దతు: బైడెన్‌

ఈ మేరకు ప్రమాదానికి ముందు.. ఆ తర్వాత ఆసుపత్రి ఆవరణకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగం గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిని తాకింది. ఈ రాకెట్ ప్రయోగానికి ముందు ఆ తరువాత ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతం’ అని ఐడీఎఫ్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

కాగా ఇజ్రాయెల్‌- హమాస్‌ ఉగ్రవాదుల మధ్య ఘర్షణ 12వ రోజుకు చేరింది. హమాస్‌ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక  సదుపాయాలను, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా  గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. భారీగా రాకెట్లు ప్రయోగిస్తుంది. ఈ దాడులో పదలు సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)