Breaking News

Pakistan: ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వ ఆదేశం

Published on Tue, 11/26/2024 - 11:57

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.

దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది. చాలా చోట్ల హింసాత్మక  ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ‘డూ ఆర్ డై’ నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వెళుతున్నారు.

ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు  ఇస్లామాబాద్ నగరంలోనికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్‌జోన్‌లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే, వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నేతలు అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్‌కు బెయిల్ లభించగా, కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)