Breaking News

భయపెట్టిన భారత్.. పాక్‌ సైన్యంలో పెను మార్పులు

Published on Thu, 05/01/2025 - 07:33

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్‌ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అసిమ్‌ మాలిక్‌ను ఆ దేశ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ (ఎన్ఎస్‌ఏ)గా నియమిస్తూ పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్‌ నుంచి ఐఎస్‌ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అసిమ్‌ మాలిక్‌కు ఎన్‌ఎస్‌ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 

ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్‌ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది.  

ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్‌ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు  హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి  ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. 



దీంతో పాక్‌ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్‌.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్‌ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ అసిమ్‌ మునీర్‌ ఆచూకీ గల్లంతైంది. భారత్‌ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్‌ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్‌ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. 

బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్‌ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు,  పాక్‌ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్‌ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్‌ మాలిక్‌కు పాక్‌ ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)