Breaking News

ఇరాక్ సంచలన వ్యూహం.. ఇరాన్‌కు సూపర్ స్ట్రోక్!

Published on Sat, 07/18/2026 - 07:20

బాగ్దాద్/వాషింగ్టన్: ప్రపంచ చమురు రాజకీయాల్లో భారీ మార్పులకు తెరలేచింది. ఎన్నో ఏళ్లుగా చమురు ఎగుమతులకు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం వెతికే పనిని ఇరాక్ ప్రారంభించింది. ఈ దిశగా అమెరికాకు చెందిన దిగ్గజ చమురు సంస్థలు చెవ్రాన్, బీపీ, కొనోకోఫిలిప్స్‌తో కలిసి 60 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మెగా ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ ఒప్పందాల్లో భాగంగా చెవ్రాన్ ఇరాక్‌లోని భారీ చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు, సిరియా లేదా టర్కీ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరే కొత్త పైప్‌లైన్ మార్గాలపై అధ్యయనం చేయనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హర్మూజ్ జలసంధిపై ఇరాక్ ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో బీపీ ఉత్తర ఇరాక్‌లోని కిర్కుక్ చమురు క్షేత్రాల పునరాభివృద్ధి చేపడుతుండగా, కొనోకోఫిలిప్స్ 42 శాతం వాటాతో ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. దీంతో ఇరాక్ చమురు ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకింత కీలకం? 
ప్రపంచంలో సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో గణనీయమైన భాగం హర్మూజ్ జలసంధి మీదుగానే ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఎగసిపడుతుంటాయి. ఇప్పుడు ఇరాక్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడంతో ప్రపంచ ఇంధన రంగంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రకటించినవి ప్రాథమిక ఒప్పందాలే. సాంకేతిక అధ్యయనాలు, ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడుల తుది ఆమోదం అనంతరమే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం మధ్యప్రాచ్య ఇంధన రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాక్ వ్యూహం ఏమిటి?
ఇరాక్ లక్ష్యం కేవలం చమురు ఉత్పత్తి పెంచడం మాత్రమే కాదు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రవాణా వ్యయాలను తగ్గించడం, భౌగోళిక-రాజకీయ ప్రమాదాలను తగ్గించడం కూడా ఈ ప్రణాళికలో భాగమే. భవిష్యత్తులో హర్మూజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా చమురు ఎగుమతులు ఆగిపోకుండా చూసే దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి.

భారత్‌కు ఎలాంటి ప్రయోజనం?
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. ఇరాక్ నుంచి కూడా భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్‌కు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు సిద్ధమైతే సరఫరాలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల అస్థిరత కొంత మేర తగ్గి, భారత్ వంటి దిగుమతి దేశాలకు దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)