Breaking News

ఇరాన్‌ రాజకీయాల్లో కలకలం.. ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు?

Published on Sun, 04/19/2026 - 16:52

టెహ్రాన్‌: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి నెలలు గడుస్తున్నా,ఆయన అంత్యక్రియలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఇరాన్‌ ప్రభుత్వంలో నెలకొన్న భయాలేనని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహిస్తే భారీ ఎత్తున జనసమూహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంత్యక్రియలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

మార్చి 4న మూడు రోజుల పాటు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా–ఇజ్రాయెల్‌ వరుస దాడుల కారణంగా ఆ ప్రణాళికను విరమించుకుంది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

1989లో ఇస్లామిక్ విప్లవ నాయకుడు, తొలి సుప్రీం లీడర్‌ రుహుల్లా మోసావీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తేహ్రాన్‌ వీధుల్లోకి పోటెత్తారు. కానీ అలీ ఖమేనీ మరణం తర్వాత అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం విశేషం.

ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్‌ విశ్లేషకుడు బెహ్నామ్ బెన్ తలెబ్లూ మాట్లాడుతూ.. ఇరాన్‌ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేనంత బలహీనంగా ఉంది. ప్రజా వీధులు తమవని ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ వాస్తవానికి ప్రజలు నిరసనలకు దిగుతారనే భయంతో 50 రోజుల పాటు ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసింది” అని వ్యాఖ్యానించారు.

అంత్యక్రియల ఆలస్యానికి కారణాలుగా వైమానిక దాడుల ముప్పు, జాతీయవాద నిరసనలు మళ్లీ చెలరేగే అవకాశం, అలాగే మోజ్తబా ఖమేనీ ఖననానికి ఆశించిన స్థాయిలో ప్రజల ముందుకు రాకపోవడం వంటి కారణాలుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఖమేనీ స్వస్థలం మష్హాద్‌ నగరాన్ని అంత్యక్రియల స్థలంగా పరిశీలిస్తున్నారు. మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా షియా ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడే ఖమేనీని సమాధి చేయాలన్న ప్రతిపాదన ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)